యూపీ సీఎంను చంపేస్తానంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపు

  • 112 టోల్ ఫ్రీ నెంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్
  • త్వరలోనే సీఎం యోగీని చంపేస్తానని హెచ్చరిక
  • నిందితుడిపై పోలీసుల కేసు నమోదు
  • రంగంలోకి దిగిన యూపీ యాంటి టెర్రర్ స్క్వాడ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను చంపేస్తానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి తాజాగా బెదిరించాడు. 112 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి, ‘‘సీఎం యోగీని  త్వరలోనే చంపేస్తా’’ అని బెదిరించాడు. ఆ తరువాత యూపీ పోలీస్ సోషల్ మీడియా డెస్క్‌కు కూడా ఓ టెక్స్ట్ మెసేజ్ పంపించాడు. దీంతో, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. సీఎంకు బెదిరింపుల నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక పోలీసు దళం యాంటీ-టెర్రర్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. నిందితుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కాగా, అత్యవసర సందర్భాల్లో ప్రజలు ప్రభుత్వ సాయం కోరేందుకు వీలుగా యూపీ ప్రభుత్వం ఈ టోల్ ఫ్రీ ఫోన్ సర్వీసులను ప్రారంభించింది.


More Telugu News