టాస్ ఓడిపోయిన సన్ రైజర్స్... వార్నర్ నిర్ణయం ఇదే!
- ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ సారథి వార్నర్
- ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
- మైదానంలో ఆసక్తికర దృశ్యం
- సరదాగా భువనేశ్వర్ కాళ్లు మొక్కిన వార్నర్
ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు సారథి డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
ఈ మ్యాచ్ కు ఓ ప్రత్యేకత ఉంది. గతంలో సన్ రైజర్స్ కు నాయకత్వం వహించి, ఆ తర్వాత కొన్ని అవాంఛనీయ పరిణామాల మధ్య కెప్టెన్సీ కోల్పోయిన డేవిడ్ వార్నర్... ఇప్పుడు ఢిల్లీ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. నాడు సన్ రైజర్స్ జట్టులో ఆటగాడిగానూ స్థానం కోల్పోయిన వార్నర్ ఇప్పుడు తన పాత జట్టుకు వ్యతిరేకంగా ఆడుతున్నాడు.
కాగా, ఇవాళ్టి మ్యాచ్ లో తుది 16 మంది సభ్యుల్లో సన్ రైజర్స్ జట్టు తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డికి స్థానం కల్పించింది. అతడికి తుది 11 మందిలో స్థానం లభిస్తుందో లేదో చూడాలి. అటు, ఢిల్లీ జట్టులో రిపల్ పటేల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడని కెప్టెన్ వార్నర్ తెలిపాడు.
పాయింట్ల పట్టిక చూస్తే... సన్ రైజర్స్ హైదరాబాద్ 9వ స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ చిట్టచివరన 10వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ 6 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించగా... ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్ లు ఆడి ఒక విజయం నమోదు చేసింది.
ఉప్పల్ స్టేడియంలో వార్నర్ కు మెరుగైన రికార్డు ఉంది. గతంలో ఇక్కడ ఆడిన మ్యాచ్ ల్లో వార్నర్ గణనీయంగా పరుగులు సాధించాడు.
ఇక, టాస్ అనంతరం, ఉప్పల్ స్టేడియంలో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రాక్టీసు చేస్తున్న సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వద్దకు వచ్చిన వార్నర్ కాళ్లకు మొక్కడం కనిపించింది. వార్నర్ అంతటివాడు తన కాళ్లకు మొక్కడంతో భువీ విస్మయానికి గురై, ఆపై చిరునవ్వులు చిందించాడు. ఈ సందర్భంగా కాసేపు సరదాగా ముచ్చటించుకున్నాడు. గతంలో సన్ రైజర్స్ సభ్యులైన భువీ, వార్నర్... ఇవాళ ఉప్పల్ లో ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. వార్నర్ ఓపెనర్ కాగా, కొత్త బంతితో భువీనే బౌలింగ్ చేయనున్నాడు.