ఇండియన్ ఆర్మీ ముందు పాక్ ఆర్మీ దిగదుడుపు... డీజిల్ కూడా లేదన్న పాక్ మాజీ ఆర్మీ చీఫ్

  • బజ్వాను ఉటంకిస్తూ షాకింగ్ విషయాలు చెప్పిన పాక్ జర్నలిస్ట్
  • భారత ఆర్మీతో పాక్ ఆర్మీ యుద్ధం చేయగలిగే పరిస్థితుల్లో లేదని బాజ్వా చెప్పినట్లు వెల్లడి
  • యుద్ధం కంటే భారత్ తో సాధారణ సంబంధాల కోసం ప్రయత్నం చేయాలని సూచన
పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాను ఉటంకిస్తూ పాకిస్థాన్ జర్నలిస్ట్ హమీద్ మీర్ షాకింగ్ విషయాలు చెప్పారు . UK44 అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీర్... దేశ సైనిక సామర్థ్యాలపై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బజ్వా వెలిబుచ్చిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యం వద్ద తగినంత ఆయుధ సంపత్తి లేదన్నారు. ఆర్థిక బలం కూడా లేదన్నారు. 2021లో బజ్వా భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో రహస్య చర్చలు జరిపినట్లు చెప్పారు. కాల్పుల విరమణ ప్రకటించాక పాక్ లో భారత ప్రధాని పర్యటించే విషయమై కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు.

ఈ విషయం తెలిసిన పాక్ విదేశాంగ శాఖ అధికారులు నాటి ప్రధాని ఇమ్రాన్ వద్దకు వెళ్లగా... ఆ విషయం తనకు కూడా తెలియదని ఇమ్రాన్ వారితో చెప్పారని గుర్తు చేసుకున్నారు. భారత ఆర్మీతో పాక్ ఆర్మీ యుద్ధం చేయగలిగే పరిస్థితుల్లో లేదని బజ్వా చెప్పినట్లు హమీద్ మీర్ తెలిపారు. పాక్ ఆర్మీ ట్యాంకులు సరిగ్గా పని చేయవని, కనీసం ఆర్మీ వాహనాలకు డీజిల్ కూడా అందుబాటులో లేదని చెప్పారు. భారత సైన్యంతో పోల్చదగ్గ స్థాయిలో పాక్ ఆర్మీ లేదన్నారు. యుద్ధం కంటే భారత్ తో సాధారణ సంబంధాల కోసం యత్నించాలని బజ్వా చెప్పినట్లు సదరు జర్నలిస్ట్ చెప్పారు. కశ్మీర్ అంశంపై ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు.


More Telugu News