40 పర్సెంట్ కమీషన్ల ప్రభుత్వాన్ని 40 సీట్లకే పరిమితం చేయండి: రాహుల్ గాంధీ
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
- కాంగ్రెస్ కు 150 సీట్లతో ఘన విజయాన్ని కట్టబెట్టాలని విన్నపం
- పార్లమెంటులోనే కాదు నిజాలను ఎక్కడైనా మాట్లాడొచ్చని వ్యాఖ్య
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదునైన విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న 40 శాతం కమీషన్ల బీజేపీని రాష్ట్రంలో 40 సీట్లకే పరిమితం చేయాలని కోరారు. 150 సీట్లతో కాంగ్రెస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై స్పందిస్తూ... నిజం మాట్లాడటానికి పార్లమెంటు మాత్రమే ఉందనే భావనలో బీజేపీ ఉన్నట్టుందని... నిజాన్ని ఎక్కడైనా మాట్లాడొచ్చని అన్నారు.
అదానీతో మీకున్న సంబంధం ఏమిటని ప్రధాని మోదీని ప్రశ్నించానని... అదానీకి ఎల్ఐసీ నిధులను ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించానని.. ఆ తర్వాత తన మైక్రోఫోన్ ను కట్ చేశారని, తన లోక్ సభ సభ్యత్వంపై వేటు వేశారని రాహుల్ విమర్శించారు. నిజం చెప్పడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా... మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.