జీవో నెంబర్ 1 విషయంలో ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- జీవో నెంబర్ 1 పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు
- జనవరి నుంచి పెండింగ్ లో ఉన్న తీర్పు
- త్వరగా తీర్పును వెలువరించాలంటూ హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు
రోడ్లు, ఇతర ప్రాంతాల్లో ర్యాలీలను, మీటింగ్ లను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవోపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. జీవో నెంబర్ 1 వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను త్వరగా పరిష్కరించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది.
కేసు వివరాల్లోకి వెళ్తే జీవో నెంబర్ 1పై గతంలో ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ ముగిసినప్పటికీ తీర్పును మాత్రం వాయిదా వేసింది. దీంతో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి నుంచి తీర్పు పెండింగ్ లో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీలైనంత త్వరగా తీర్పును వెలువరించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.