బన్నీ మైండ్ బ్లోయింగ్ డాన్సర్: సాక్షి వైద్య

  • 'ఏజెంట్'తో పరిచయమవుతున్న సాక్షి వైద్య 
  • తొలిరోజు షూటింగ్ నెర్వస్ గా అనిపించిందని వ్యాఖ్య 
  • సురేందర్ రెడ్డి .. అఖిల్ సపోర్టు చేశారని వెల్లడి 
  • టాలీవుడ్ హీరోల గురించి మనసులో మాటచెప్పిన సాక్షి వైద్య  
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు పరిచయమయ్యారు. తాజాగా ఆ జాబితాలో సాక్షి వైద్య కూడా చేరింది. అఖిల్ జోడీగా 'ఏజెంట్' సినిమాతో ఆమె పరిచయమవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను పుట్టి పెరిగింది ముంబైలోనే. బాలీవుడ్ సినిమాల ఆడిషన్స్ కి అటెండ్ అవుతూ ఉండగా, 'ఏజెంట్' సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది" అని చెప్పింది. "కెరియర్ పరంగా నాకు ఇది ఫస్టు మూవీ. కెమెరా లుక్ పై నాకు ఎంతమాత్రం నాలెడ్జ్ లేదు. అందువలన కొంత నెర్వస్ గా అనిపించింది. సురేందర్ రెడ్డిగారు .. అఖిల్ గారు ఇద్దరూ కూడా నాకు ఎంతో సపోర్టును ఇచ్చారు. ఈ సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది .. నాకు మంచి పేరు తీసుకుని వస్తుంది" అనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. టాలీవుడ్ కి సంబంధించి పవన్ కల్యాణ్ గారి పేరు వినగానే పోలీస్ ఆఫీసర్ పాత్రలు గుర్తొస్తాయి. మహేశ్ బాబును చూడగానే చాలా హంబుల్ పర్సన్ అనిపిస్తారు. ఎన్టీఆర్ అనగానే 'కొమరం భీమ్ గా ఆయన నటన కళ్లముందు కదలాడుతుంది. అఖిల్ విషయానికి వస్తే తను చాలా రొమాంటిక్ వైల్డ్ ఫెలో. విజయ్ దేవరకొండ మాత్రం టాక్సిక్ లవర్ బాయ్ అని చెబుతాను. ఇక బన్నీ మైండ్ బ్లోయింగ్ డాన్సర్ అని అంటాను" అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది.



More Telugu News