నేను పోలీసును కొట్టలేదు.. చేయి అలా అన్నానంతే: వైఎస్ విజయమ్మ
- జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న విజయమ్మ
- పోలీసులు మీద పడుతుంటే కోపం రాదా అని ప్రశ్న
- నిజంగా కొట్టాలనుకుంటే గట్టిగా కొట్టేదాన్నని వ్యాఖ్య
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆమె తల్లి విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల టెర్రరిస్టు కాదు, ఉద్యమకారిణి కాదని అన్నారు. సిట్ కార్యాలయానికి షర్మిల వెళ్తే తప్పేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నందుకు షర్మిలను వేధిస్తున్నారని మండిపడ్డారు. షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని మండిపడ్డారు. షర్మిల ఎక్కడకీ వెళ్లకూడదా అని ప్రశ్నించారు. షర్మిల డ్రైవర్ పై కూడా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వైఎస్ రాజశేఖరెడ్డి ఆశయాల సాధన కోసమే షర్మిల పార్టీ పెట్టిందని అన్నారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తాను పోలీసును కొట్టానంటూ టీవీ ఛానళ్లలో చూపిస్తున్నారని విజయమ్మ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తనపై పడుతుంటే కోపం రాదా అని ప్రశ్నించారు. తాను నిజంగా కొట్టాలనుకుంటే గట్టిగా కొట్టేదాన్నని అన్నారు. తాను కొట్టలేదని, చేత్తో అలా అన్నానంతేనని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మీడియాకు ఉందని అన్నారు.