యాపిల్ స్టోర్ లో ఉద్యోగులు అసాధారణ ప్రతిభావంతులే.. ప్యాకేజీ కూడా భారీగానే
- ఢిల్లీ, ముంబైలో తెరుచుకున్న యాపిల్ ఎక్స్ క్లూజివ్ రిటైల్ స్టోర్లు
- ఒక్కో ఉద్యోగికి వేతనం లక్ష రూపాయలకు పైనే
- బహుభాషా ప్రావీణ్యం, ఉన్నత, సాంకేతిక విద్యార్హతలకు ప్రాధాన్యం
యాపిల్ ఢిల్లీ, ముంబైలో ఎక్స్ క్లూజివ్ రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. రెండు స్టోర్లలోనూ కలిపి 170 మంది ఉద్యోగులను నియమించుకుంది. వీరి విద్యార్హతలు తెలిస్తే ఓ సారి ఆశ్చర్యపోవాల్సిందే. యాపిల్ స్టోర్లను సందర్శించే కస్టమర్లు అక్కడి ఉద్యోగులను తమ మాతృభాషలో కావాల్సిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న వారికి 15 భాషల్లో మాట్లాడగలిగే సామర్థ్యాలు ఉన్నాయట.
ఎంబీఏ, బీటెక్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ తదితర విద్యార్హతలు ఉన్న వారికి యాపిల్ తన స్టోర్లలో ఉద్యోగాలు ఇచ్చింది. రిటైల్ స్టోర్లలో పనిచేస్తున్న ఒక్కొక్కరికి రూ.లక్ష వేతనంగా ఇస్తోంది. దేశంలోని ఇతర ఎలక్ట్రానిక్ రిటైల్ స్టోర్లలో ఉద్యోగులకు చెల్లిస్తున్న సగటు వేతనంతో పోలిస్తే యాపిల్ ఇస్తున్నది 3-4 రెట్లు ఎక్కువ. యాపిల్ విక్రయించే ఉత్పత్తుల్లో లాభాల మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక తన ఉద్యోగులకు పెద్ద మొత్తంలోనే వేతనాలను చెల్లిస్తోంది.
యాపిల్ టెక్నికల్ ఉద్యోగులకు ఎంబీఏ, డేటా అనలైటిక్స్ నైపుణ్యాలు కూడా ఉన్నాయి. విదేశాల్లోని యాపిల్ స్టోర్లలో పనిచేసిన కొందరికి ఇక్కడ యాపిల్ కొలువులు ఇచ్చినట్టు తెలిసింది. యాపిల్ స్టోర్లలో జీనియస్ పోస్ట్ కు ఇంకా ఓపెనింగ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి తగిన విద్యార్హతలకు తోడు, సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవాలన్న ఆసక్తి, యాపిల్ ఉత్పత్తులు గురించి తెలుసుకోవాలన్న అభిలాష ఉండడం తప్పనిసరి.