ట్రంప్ చేతిలో చాటంత పిజ్జా.. ఓ పీస్ కావాలా? అంటూ ఆఫర్
- ఫ్లోరిడాలోని ఫోర్ట్ మయర్స్ వద్ద అనుకోకుండా ఆగిన ట్రంప్
- ఓ పిజ్జా హౌస్ లోకి వెళ్లి పెద్ద పిజ్జా కోసం ఆర్డర్
- దాన్ని తింటూ, మీకూ కావాలా? అంటూ అభిమానులకు ఆఫర్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శైలి విభిన్నం. ఫ్లోరిడాలోని ఫోర్ట్ మయర్స్ లో రిపబ్లిక్ పార్టీ ప్రసంగం తర్వాత, ఓ పిజ్జా హౌస్ వద్ద అనుకోకుండా ఆగి తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఓ పెద్ద పిజ్జా కోసం ఆర్డర్ చేసిన ట్రంప్.. తాన్ని పీస్ లుగా తీసుకుని తింటున్నారు. తన చుట్టూ అభిమానులు చేరడంతో ‘‘నేను తింటున్న పీస్ మీలో ఎవరికి అయినా కావాలా?’’ అంటూ ఆఫర్ చేశారు.
ఈ వీడియోని ఓ రిపోర్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ట్రంప్ పిజ్జాని ఆఫర్ చేయడంతో అభిమానులు ‘ట్రంప్ ట్రంప్ ట్రంప్’ అంటూ నినాదాలు అందుకున్నారు. ట్రంప్ ను ఇటీవలే అరెస్ట్ చేయడం, విడుదల చేయడం తెలిసిందే. ఓ పోర్న్ స్టార్ తో ట్రంప్ చేసుకున్న ఒప్పందాలపై ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు నమోదు తనకు మరింత ప్రచారాన్ని తీసుకొస్తుందని స్వయంగా ట్రంప్ లోగడ ప్రకటించడం గమనార్హం.
ట్రంప్ పై ఆరోపణలు వచ్చినప్పటికీ, 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయనే ప్రధాన ప్రత్యర్థిగా తెరపైకి వచ్చారు. గతేడాది నవంబర్ లోనే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రచారం ప్రారంభించడం గమనార్హం. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ తో పోటీ పడుతూ రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ లీడ్ లో ఉన్నారు. డీశాంటిస్ ఇంకా తన ప్రచారాన్ని ప్రారంభించనే లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ట్రంప్ ఎదుర్కోవడం ఇది మూడోసారి కానుంది.