'నాలుగు స్థంభాలాట' షూటింగు సమయంలో బైక్ పై నుంచి పడిపోయాను: నటి పూర్ణిమ
- 1980లలో కథానాయికగా మెప్పించిన పూర్ణిమ
- జంధ్యాల సినిమాల్లో ఎక్కువగా దక్కిన అవకాశాలు
- పేరు తెచ్చిపెట్టిన ప్రేమకథా చిత్రాలు
- నరేశ్ జోడీగా దక్కిన విజయాలు
1980లలో తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలలో సందడి చేసిన కథానాయికగా పూర్ణిమ కనిపిస్తారు. అప్పట్లో ఆమె జంధ్యాల - నరేశ్ కాంబినేషన్ లోని సినిమాలను ఎక్కువగా చేశారు. తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్ణిమ మాట్లాడుతూ 'నాలుగు స్థంభాలాట' సినిమా షూటింగు సమయంలో తనకి జరిగిన ప్రమాదాన్ని గురించి ప్రస్తావించారు.
"ఈ సినిమా షూటింగును వైజాగ్ బీచ్ లో ప్లాన్ చేశారు. అప్పటికే అక్కడికి జనాలు చాలామంది వచ్చేశారు. దాంతో 'జనాలు గుమిగూడుతున్నారు .. మీరు అలా ఒకసారి వెళ్లిరండి' అని జంధ్యాలగారు మాతో అన్నారు. దాంతో నేను .. నరేశ్ గారు కలిసి బైక్ పై వెళుతున్నాము. నరేశ్ గారు చాలా స్పీడ్ గా బైక్ నడుపుతూ ఉన్నారు. అప్పుడు నా పరికిణి బైక్ చక్రంలో పడిపోయింది.
"దాంతో నేను బైక్ పై నుంచి పడిపోయాను. అయినా నరేశ్ గారు చూసుకోలేదు. నా పరికిణీ అంతా చిరిగిపోయింది. కాళ్లు .. చేతులు కొట్టుకుపోయి .. ఒళ్లంతా బ్లడ్. నేను నా గాయాల గురించి పట్టించుకోకుండా పరికిణీ సరిచేసుకుందామని చూస్తే కుదరడం లేదు. ఆ వెంటనే నరేశ్ గారు వెనక్కి తిరిగి రావడం .. నన్ను హాస్పిటల్లో చేర్పించడం జరిగిపోయాయి" అంటూ చెప్పుకొచ్చారు.