మంజీరా నది గరుడగంగ కుంభమేళా ప్రారంభం

  • మంజీరా నదిలో ప్రవేశించిన పుష్కరుడు
  • పంచవటి క్షేత్రం పీఠాధిపతి ఆధ్వర్యంలో ధ్వజారోహనంతో కుంభమేళా ప్రారంభం
  • ఉత్తరాది నుంచి రానున్న నాగా సాధువులు, సాధుసంతులు, పీఠాధిపతులు
తెలంగాణలోని మంజీరా నది గరుడగంగ కుంభమేళా ప్రారంభమయింది. మంజీరా నదిలో పుష్కరుడు ప్రవేశించడంతో కుంభమేళాను నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం పంచవటి క్షేత్రం ఆవరణలో గరుడగంగ కుంభమేళాను ప్రారంభించారు. పంచవటి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ధ్వజారోహనంతో కుంభమేళా ప్రారంభమయింది. కాసేపట్లో అంటే ఉదయం 11 గంటల నుంచి మంజీరా నదిలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించడం ప్రారంభమవుతుంది. కుంభమేళా నేపథ్యంలో ప్రత్యేక పూజలు, బోనాలు నిర్వహిస్తారు. ఉత్తరాది నుంచి నాగా సాధువులు, సాధుసంతులు, పీఠాధిపతులు కూడా కుంభమేళాకు తరలిరానున్నారు.


More Telugu News