ప్రయాణికుల రద్దీ.. హైదరాబాద్-సోలాపూర్ మధ్య నేటి నుంచి ప్రత్యేక రైలు
- వచ్చే నెల 14 వరకు అందుబాటులోకి ప్రత్యేక రైలు
- ఉదయం 6 గంటలకు నాంపల్లిలో బయలుదేరనున్న రైలు
- బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, శహబాద్, కలబురిగి మీదుగా ప్రయాణం
- తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.20 గంటలకు సోలాపూర్‌లో బయలుదేరనున్న రైలు
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నేటి నుంచి వచ్చే నెల 14 వరకు హైదరాబాద్-సోలాపూర్ మధ్య ప్రత్యేక రైలును (07003/07004) అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్(నాంపల్లి స్టేషన్) నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది.
ఈ రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, శహబాద్, కలబురిగి, గంగాపూర్ రోడ్, తిలాతి స్టేషన్ల మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 12.20 గంటలకు సోలాపూర్ చేరుతుంది. తిరిగి 1.20 గంటలకు సోలాపూర్‌లో బయలుదేరి రాత్రి 8.30 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.