తిరుమల కొండపై మళ్లీ వర్షం... రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు
- తిరుమల క్షేత్రంలో నేడు రెండుసార్లు వర్షం
- తడిసి ముద్దయిన మాడవీధులు, రోడ్లు
- షెడ్ల కింద తల దాచుకున్న భక్తులు
- షాపింగ్ కాంప్లెక్స్ లలోకి నీరు
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో నేడు రెండుసార్లు వర్షం కురిసింది. వర్షం కారణంగా తిరుమాడ వీధులు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు ప్రవహించింది. పలు షాపింగ్ కాంప్లెక్స్ లలోకి నీరు ప్రవేశించింది. భక్తులు షెడ్ల కింద తల దాచుకోవాల్సి వచ్చింది.
తొలుత మధ్యాహ్నం 2 గంటల సమయంలో వర్షం పడింది. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటల సమయంలో వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు భక్తులు ఇబ్బందిపడ్డారు.
ఉపరితల ద్రోణి కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఇద్దరు రైతులు పిడుగుపడి మృతి చెందారు. కల్లంలోని మిర్చి పంటపై పట్టలు కప్పుతుండగా పిడుగు పడడంతో శ్యాంబాబు, కృపాదానం అనే రైతులు మృత్యువాతపడ్డారు.