తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ రాష్ట్రాన్ని చూపించగలరా?: అమిత్ షాకు కేటీఆర్ సవాల్

  • తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా 
  • ఐటీఐఆర్ హైదరాబాద్ సహా పలు హామీలపై కేటీఆర్ సూటి ప్రశ్న
  • వివిధ హామీలలో ఏమీ చేయలేదని ఎద్దేవా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఐటీఐఆర్ హైదరాబాద్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఐఐటీ, ఐఐటీ, ఎన్ఐడీ, నవోదయా, మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీలకు పునాది రాయి వేసినందుకు థ్యాంక్స్ హోంమంత్రి అమిత్ షా గారూ! అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. అంతలోనే... "ఇందులో ఏమీ చేయలేదు" అంటూ విమర్శలు గుప్పించారు.

గత తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాన్ని ఒక్కదానిని అయినా చూపగలరా? అని అని అమిత్ షాకు సవాల్ విసిరారు. కేటీఆర్ ట్వీట్ పైన నెటిజన్లు చాలామంది స్పందించారు. 

కాగా, ఆదివారం బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, నిరుద్యోగం, రిజర్వేషన్లు... తదితర అంశాలపై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


More Telugu News