స్టార్ హీరోలు కలిసి చేసిన మరో అద్భుతమే 'పొన్నియిన్ సెల్వన్ 2': ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు
- ఈ నెల 28న రిలీజ్ అవుతున్న 'పీస్ ఎస్ 2'
- ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్
- హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు
- మణిరత్నం సినిమాతోనే తన జర్నీ మొదలైందని వెల్లడి
మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిరత్నం .. లైకా సుభాస్కరన్ కలిసి నిర్మించిన ఈ సినిమాను, తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ - 'నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్'లో నిర్వహించారు. దర్శక నిర్మాతలతో పాటు విక్రమ్ .. కార్తి .. ఐశ్వర్యరాయ్ .. త్రిష .. సుహాసిని తదితరులు హాజరయ్యారు.
దిల్ రాజు మాట్లాడుతూ .. "నా ఫేవరేట్ సినిమా మణిరత్నంగారి 'గీతాంజలి'. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'అమృత' సినిమాతో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అలాంటి మణిరత్నం గారు 'పొన్నియిన్ సెల్వన్1' సినిమాను నా బ్యానర్ నుంచి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ కావడం జరిగింది. 'పొన్నియిన్ సెల్వన్ 2' ను కూడా ఇక్కడ మా సంస్థ నుంచి రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది" అని అన్నారు.
"ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. స్టార్ హీరోలంతా కలిసి 'పొన్నియిన్ సెల్వన్ 2'లో చేసే అద్భుతాలను చూడబోతున్నాము. మణిరత్నం - రెహ్మాన్ గారి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా అద్భుతాలను చూడనుంది" అంటూ చెప్పుకొచ్చారు.