తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బోల్తా పడిన కారు
- 33వ మలుపు వద్ద ఘటన
- అదుపుతప్పి రోడ్డు పక్కకి పడిపోయిన కారు
- ఘటన జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు
- ప్రయాణికులకు స్వల్ప గాయాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డు 33వ మలుపు వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తాపడింది. రెయిలింగ్ వాల్ ను కూడా దాటి పోయి కారు పక్కకి ఒరిగిపోయింది. ఆ సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. ఘాట్ రోడ్డు పక్కన లోతు తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది. కారులోని వారికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇతర వాహనాల వారు ఈ విషయాన్ని టీటీడీ భద్రతా సిబ్బందికి తెలియజేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కారు నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కారులోని వారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.