అధికారిక బంగ్లా ఖాళీ చేయించారు... నాకు ఇళ్లు అవసరం లేదు: రాహుల్ గాంధీ
- రెండు రోజుల కర్ణాటక పర్యటనకు విచ్చేసిన రాహుల్ గాంధీ
- కుడాల సంగమం నుండి పర్యటన ప్రారంభం
- శివాజీకి, బసవేశ్వరుడికి కాంగ్రెస్ నేత నివాళులు
- లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆగ్రహం
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటకలోని విజయపురలో భారీ రోడ్డు షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనం పైన నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. చాలామంది రాహుల్, రాహుల్ అంటూ నినాదాలు చేస్తూ, బిగ్గరగా చీర్స్ చెబుతూ కనిపించారు. ఆయన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షోను ప్రారంభించారు.
శివాజీ సర్కిల్, కనకదాస సర్కిల్ నుండి డప్పుల చప్పుడుతో వివిధ ప్రాంతాల్లో రోడ్డు షోను నిర్వహించారు. రాహుల్ గాంధీ ఈ రోజు ముందుగా తన రెండు రోజుల కర్ణాటక పర్యటనను కుడాల సంగమం నుండి ప్రారంభించారు. అక్కడ ఆయన 12వ శతాబ్దపు కవి మరియు సంఘ సంస్కర్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.
కర్నాటక ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ... తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, అధికార బంగ్లా ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వందలాది మంది తమ ఇంటికి రావాలని, తమ ఇళ్లు తీసుకోవాలని తనకు లేఖలు రాశారని గుర్తు చేసుకున్నారు. తనకు ఇళ్లు అవసరం లేదని, దేశమే తన ఇల్లు ఇని పేర్కొన్నారు.