మొదటిసారిగా ఓ మహిళను నగర బహిష్కరణ చేసిన విజయవాడ పోలీసులు

  • సారమ్మ అనే మహిళకు నగర బహిష్కరణ
  • పలుమార్లు గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన సారమ్మ
  • తీరుమార్చుకోని వైనం
  • అజిత్ సింగ్ నగర్ పీఎస్ లో సారమ్మపై 13 కేసులు ఉన్నాయన్న సీపీ
విజయవాడ చరిత్రలో మొదటిసారిగా పోలీసులు ఓ మహిళను నగర బహిష్కరణ చేశారు. ఆమె పేరు సారమ్మ. అనేక పర్యాయాలు గంజాయి విక్రయిస్తూ పట్టుబడింది. అయినప్పటికీ ఆమె తీరు మార్చుకోలేదని బెజవాడ సీపీ కాంతిరాణా టాటా పేర్కొన్నారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో సారమ్మపై 13 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అందుకే ఆమె నగరంలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా 2021లో విజయవాడ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చీ రావడంతో రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపారు. పలువురు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తీరు మారని రౌడీషీటర్లకు నగర బహిష్కరణ చేశారు. ఇప్పటికీ అదే పంథా అనుసరిస్తున్నారు.


More Telugu News