దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్

  • రాబోయే అయిదు రోజుల్లో దేశవ్యాప్తంగా తగ్గనున్న ఎండల తీవ్రత
  • వడగాలులు వీచే అవకాశాలు తక్కువన్న వాతావరణ శాఖ
  • తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
భానుడి భగభగలతో అల్లాడిపోతున్న భారతీయులకు వాతావరణ శాఖ తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న ఐదు రోజుల్లో ఎండల తీవ్రత తగ్గుతుందని వెల్లడించింది. దేశంలోని అధికశాతం ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం లేదని పేర్కొంది. 

తమిళనాడు, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఫలితంగా, ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. దక్షిణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, యూపీ, పంజాబ్, తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వానలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా పేర్కొంది.


More Telugu News