పోరంకిలో ఎన్టీ రామారావు చారిత్రక ప్రసంగ పుస్తకాల ఆవిష్కరణ.. హాజరుకానున్న రజనీకాంత్
- ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సిద్ధమవుతున్న విజయవాడ
- ఈ నెల 28న పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో పుస్తకాల ఆవిష్కరణ
- ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా వెబ్‌సైట్, యాప్ రూపకల్పన
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు విజయవాడ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 28న పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరవుతారు. ఎన్టీఆర్‌పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్ట్ ఎస్.వెంకటనారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మే 28న ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజును పురస్కరించుకుని విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం టీడీ జనార్దన్ నేతృత్వంలో సావనీర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా వెబ్‌సైట్, యాప్‌ను కూడా తీసుకురాబోతున్నారు. ఈ రెండింటి ఆవిష్కరణ కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.
ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలతో రెండు పుస్తకాలు, ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో ఓ పుస్తకం, బయట చేసిన ప్రసంగాల సంకలనంతో మరో పుస్తకం తీసుకున్నారు. చారిత్రక ప్రసంగాలు పేరుతో తీసుకొస్తున్న ఈ పుస్తకాలను ఈ నెల 28న పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఆవిష్కరిస్తారు.