రేపటి నుంచి లోకేశ్ పాదయాత్ర మళ్లీ షురూ

  • నేడు రంజాన్
  • లోకేశ్ యువగళం పాదయాత్రకు విరామం
  • ప్రస్తుతం ఆదోనీ నియోజకవర్గంలో పాదయాత్ర
  • రేపు కడితోట క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర కొనసాగింపు 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేడు విరామం ప్రకటించడం తెలిసిందే. ఇవాళ రంజాన్ పండుగ కావడంతో పాదయాత్ర ఒక్క రోజు పాటు నిలిపివేయాలని లోకేశ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, యువగళం రేపు (ఏప్రిల్ 23) మళ్లీ షురూ కానుంది. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరుగుతోంది. రేపు కడితోట క్రాస్ క్యాంప్ సైట్ నుంచి లోకేశ్ తన పాదయాత్ర కొనసాగించనున్నారు.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన దూరం 1004.8 కి.మీ.

78వ రోజు (23-4-2023) యువగళం వివరాలు:
ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):

ఉదయం
7.00–కడితోట క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30– గనేకల్ క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
9.40– జాలిమంచి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
9.55– పాండవగల్ క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
10.50– భల్లేకల్ క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
11.00– కుప్పగల్ క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
మధ్యాహ్నం
12.05– కుప్పగల్ శివార్లలో బీసీ సామాజికవర్గీయులతో భేటీ.
1.05– కుప్పగల్ శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
4.00– కుప్పగల్ శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.00– పెద్దతుంబలంలో స్థానికులతో సమావేశం.
6.40– తుంబలం క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.

****


More Telugu News