చోళుల రాకను మిస్ కావద్దు.. పొన్నియన్ సెల్వన్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ట్వీట్!
- హైదరాబాద్ లోని నోవాటెల్‌లో రేపు పీఎస్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్
- ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా పొన్నియన్ సెల్వన్ విడుదల
మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పొన్నియన్ సెల్వన్-2’. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం హైదరాబాద్ లోని నోవాటెల్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ట్విట్టర్ లో అప్ డేట్ ఇచ్చింది. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.
‘‘హైదరాబాద్‌లో చోళుల గ్రాండ్ రాకను మిస్ అవ్వకండి! ఏప్రిల్ 23న సాయంత్రం 5:30 గంటలకు నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో మాతో కలవండి. తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పొన్నియన్ సెల్వన్ ను రిలీజ్ చేస్తున్నాం’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. ఇక ఈ సినిమాకు తెలుగులో దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
హిస్టారికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించారు. గతేడాది సెప్టెంబర్ చివరి వారంలో పార్ట్-1 రిలీజైంది. తమిళనాట కాసుల వర్షం కురిపించింది. అయితే మిగితా భాషల్లో మాత్రం యావరేజ్ గానే ఆడింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు.