ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ.. వీడియో ఇదిగో 

  • నెల రోజుల క్రితం లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ
  • అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ లోక్ సభ హౌసింగ్ కమిటీ నోటీసులు
  • నోటీసుల మేరకు నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్
సెంట్రల్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో ఉన్న తన అధికారిక నివాసాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. బంగ్లాను ఖాళీ చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకాగాంధీలు ఈ ఉదయం నుంచి రెండు సార్లు ఆ నివాసానికి వెళ్లారు. మోదీ ఇంటి పేరును కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే కేసులో రాహుల్ కు గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో, ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఎంపీగా సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో... నెల రోజుల్లోగా (ఏప్రిల్ 22) అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని రాహుల్ కు లోక్ సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే, నోటీసులో పేర్కొన్న చివరి రోజైన ఈరోజు ఆయన బంగ్లాను ఖాళీ చేశారు. మరోవైపు బీజేపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.  



More Telugu News