'వాల్తేరు వీరయ్య' 100 రోజులు ఆడిన సెంటర్స్ ఇవే .. లాభం ఎంతంటే..!
- ఈ జనవరి 13న వచ్చిన 'వాల్తేరు వీరయ్య'
- 2 కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకున్న సినిమా
- ప్రపంచవ్యాప్తంగా 236.15కోట్ల వసూళ్లు
- వైజాగ్ జగదాంబ థియేటర్లో ఈ సినిమాదే రికార్డు
చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్ బ్యానర్ లో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను తొలిరోజునే హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా, ఈ రోజుతో 100 రోజులను పూర్తిచేసుకుంది. చీపురుపల్లిలోను .. అవనిగడ్డలోను ఈ సినిమా 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం విశేషం. వైజాగ్ 'జగదాంబ థియేటర్'లో అత్యధిక వసూళ్లను సాధించిన రికార్డు ఈ సినిమా పేరుపైనే ఉంది. చిరంజీవి కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఫుల్ రన్ లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 189.05 కోట్ల గ్రాస్ ను .. ప్రపంచవ్యాప్తంగా 236.15 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ సినిమా 48.5 కోట్ల లాభాలను తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ మాస్ యాక్షన్ .. శ్రుతి హాసన్ గ్లామర్ .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పచ్చు.