మోదీ కటౌట్ పై పడ్డ వాననీటిని తుడిచిన అభిమాని.. అమిత్ షా షేర్ చేసిన వీడియో వైరల్
- మోదీ కటౌట్‌పై వాననీటిని కండువాతో తుడిచిన అభిమాని
- డబ్బుల కోసం చేయట్లేదని వ్యాఖ్య
- మోదీయే మాకు దేవుడంటూ తీవ్ర భావోద్వేగం
- ఘటన వీడియోను షేర్ చేసిన హోం మంత్రి అమిత్ షా
- ఈ అభిమానమే మా బలం అంటూ వ్యాఖ్య
ప్రధాని మోదీ కటౌట్‌పై పడ్డ వాన నీటిని తన కండువాతో తుడిచిన అభిమాని వీడియోను హోం మంత్రి అమిత్ షా తాజాగా షేర్ చేశారు. ఈ అభిమానమే బీజేపీ శక్తి అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కర్ణాటకలోని దేవనహళ్లి ప్రాంతంలో శుక్రవారం బీజేపీ రోడ్ షో ప్లాన్ చేసింది. పలు ప్రాంతాల్లో మోదీ కటౌట్లు ఏర్పాటు చేసింది. ఈ సభకు హోం మంత్రి అమిత్ షా కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే.. వర్షం కారణంగా ఈ రోడ్ షో రద్దయిపోయింది.
ఈ క్రమంలో ఓ మోదీ కటౌట్‌పై వాన చినుకులను చూసిన అభిమాని ఒకరు తన కండువాతో వాటిని తుడిచేశాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నావా? అని అతడు ఆ అభిమానిని ప్రశ్నించగా..‘‘నాకు డబ్బులు అవసరం లేదు. నేను ఎవరి నుంచీ డబ్బులు ఆశించను. మోదీపై విశ్వాసం, ప్రేమాభిమానాలతోనే ఇదంతా చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడా అభిమాని. అంతేకాకుండా.. మోదీ మాకు దేవుడు అంటూ తీవ్రభావోద్వేగానికి లోనవుతూ సమాధానమిచ్చాడు.
ఈ వీడియోను హోం మంత్రి అమిత్‌షా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘మోదీపై అచంచల విశ్వాసం, నిస్వార్థ ప్రేమాభిమానాలే బీజేపి బలం, ఆస్తి. ఈ అద్భుతమైన వీడియో చూడండి’’ అంటూ కామెంట్ చేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ శాఖ కూడా స్పందించింది. రాష్ట్రంలో అనేక మంది మోదీని తమ కుటుంబసభ్యుడిగా భావిస్తారని వ్యాఖ్యానించింది.