మీరు ట్విట్టర్ లోనే ఉండాలి.. బ్లూ టిక్ చందా నేను కడతా: మస్క్
- కొంత మంది ప్రముఖుల తరఫున తానే చెల్లించాలని నిర్ణయించిన మస్క్
- అమెరికా రచయితలు స్టీఫెన్ కింగ్, లెబ్రాన్ జేమ్స్ కు ఈ గౌరవం
- వారు ట్విట్టర్ లో కొనసాగాలని కోరుకుంటున్న టెస్లా అధినేత
బ్లూ టిక్ కావాలంటే చందా కట్టాలనే విధానాన్ని ట్విట్టర్ అమల్లో పెట్టడంతో.. మన దేశంలో ఎంతో మంది సెలబ్రిటీలు బ్లూ టిక్ కోల్పోయారు. వీరంతా బ్లూ టిక్ కోసం ట్విట్టర్ నిర్దేశించిన మేర చందా చెల్లించలేదు. మన దేశంలోనే అని కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే యూజర్లు ట్విట్టర్ బ్లూ టిక్ చందాపై స్పందించలేదు. బిల్ గేట్స్ కూడా బ్లూ టిక్ కోల్పోయారు. మన దేశంలో అయితే షారూక్ ఖాన్, విరాట్ కోహ్లీ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితాయే ఉంది.
అయితే, కొందరు వ్యక్తులకు మాత్రం బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించలేదు. సరికదా వారి తరఫున చందాని ట్విట్టర్ యజమాని అయిన ఎలాన్ మస్క్ స్వయంగా చెల్లిస్తానని ప్రకటించారు. అమెరికా రచయితలు అయిన స్టీఫెన్ కింగ్, లెబ్రాన్ జేమ్స్ ఈ జాబితాలో ఉన్నారు. తాను ట్విట్టర్ బ్లూ టిక్ చందా కట్టబోనని జేమ్స్ లోగడే ప్రకటించారు. దీంతో కొందరు ప్రముఖులు ట్విట్టర్ లోనే ఉండాలని కోరుకుంటున్న మస్క్ తాను వారి తరఫున చందా చెల్లించాలని నిర్ణయించారు.
‘‘నా ట్విట్టర్ అకౌంట్ బ్లూ టిక్ కు సబ్ స్క్రయిబ్ అయినట్టు సూచిస్తోంది. కానీ, నేను ఎలాంటి చందా చెల్లించలేదు. నేను ఫోన్ నంబర్ ఇచ్చినట్టు ట్విట్టర్ అకౌంట్ చెబుతోంది. కానీ, నేను ఇవ్వలేదు’’ అంటూ స్టీఫెన్ కింగ్ పోస్ట్ పెట్టారు. దానికి ‘‘మీకు ఆహ్వానం, నమస్తే’’ అని మస్క్ రిప్లయ్ ఇచ్చారు. బ్లూటిక్ అనేది ఫలానా వ్యక్తికి సంబంధించిన ఇది అసలైన అకౌంట్ అని నిర్ధారణకు చిహ్నం.