భారత్‌లో కొత్తగా 12 వేలకు పైగా కరోనా కేసులు
- గత 24 గంటల్లో 12,193 కరోనా కేసుల నమోదు
- కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
- మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని వెల్లడి
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12,193 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. కరోనా కారణంగా శుక్రవారం 42 మరణాలు సంభవించాయని వెల్లడించింది. వీరిలో పది మంది కేరళవాసులని తెలిపింది. తాజా లెక్కల ప్రకారం..కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ దేశంలో 4,48,81,877 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం 5,31,300 మంది అసువులు బాసారు.
ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. జాతీయ సగటు రికవరీ రేటు 98.66 శాతమని పేర్కొంది. అంతేకాకుండా, ఇప్పటివరకూ 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొంది.