సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ఫుల్ డిమాండ్.. రెట్టింపు కానున్న కోచ్‌లు!

  • ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న రైలు
  • 16 బోగీలతో నడపాలంటూ రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు
  • మరో 10 రోజుల్లోనే అందుబాటులోకి అదనపు కోచ్‌లు!
సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ రైలులో ప్రయాణించేందుకు జనం ఆసక్తి చూపిస్తుండడంతో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రైలులో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 8 కోచ్‌లతోనే ఈ రైలు నడుస్తుండగా వీటిని రెట్టింపు చేయాలని యోచిస్తున్నారు. 

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రస్తుతం 120-130 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. దీంతో చాలామంది ప్రయాణికులకు టికెట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను రెట్టింపు చేసి 16 కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఫలితంగా మరో 10 రోజుల్లోనే అదనపు బోగీలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


More Telugu News