రాళ్ల దాడిలో గాయపడిన ఎన్ఎస్ జీ అధికారి... పరామర్శించిన చంద్రబాబు
- యర్రగొండపాలెంలో ఉద్రిక్తత
- చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి
- చంద్రబాబుకు రక్షణగా నిలిచిన ఎన్ఎస్ జీ కమాండెంట్ కు గాయం
- తలకు మూడు కుట్లు పడిన వైనం
- చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. యర్రగొండపాలెం వచ్చిన నేపథ్యంలో, ఆయన వాహనంపై రాళ్ల దాడి జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు వాహనానికి రక్షణగా నిలబడిన ఎన్ఎస్ జీ కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయమైంది. సంతోష్ కుమార్ కు వైద్య సిబ్బంది చికిత్స అందించారు. గాయానికి మూడు కుట్లు పడ్డాయి.
ప్రజల్లో చంద్రబాబుకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక, వివేకా హత్యను దారి మళ్లించడం కోసం వైసీపీ ఇలాంటి దుశ్చర్యలకు దిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. కాగా, రాళ్ల దాడిలో గాయపడిన ఎన్ఎస్ జీ అధికారి సంతోష్ కుమార్ ను చంద్రబాబు పరామర్శించారు. సంతోష్ కుమార్ కు అందిన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.