సన్ రైజర్స్ ఈ స్కోరును కాపాడుకుంటే గొప్పే!
- చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ సూపర్ కింగ్స్
- టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు
- 34 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ
- 3 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా
చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ ఓడిన సన్ రైజర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ ముందు సన్ రైజర్స్ బ్యాటర్లు నిలవలేకపోయారు. ఎవరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసి సన్ రైజర్స్ ను దెబ్బకొట్టాడు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి (21), మయాంక్ అగర్వాల్ (2)లను జడేజా పెవిలియన్ చేర్చాడు.
ఓపెనర్ హ్యారీ బ్రూక్ మరోసారి నిరాశపరిచాడు. 18 పరుగులు చేసిన బ్రూక్... ఆకాశ్ సింగ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. కెప్టెన్ మార్ క్రమ్ 12, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ 17 పరుగులు చేశారు. మార్ క్రమ్ ను తీక్షణ అవుట్ చేయగా, క్లాసెన్ ను పతిరణ పెవిలియన్ చేర్చాడు. మార్కో జాన్సెన్ 17 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.