'వీరసింహారెడ్డి' 100 రోజులను పూర్తిచేసుకుంది ఈ సెంటర్స్ లోనే!

  • జనవరి 12న విడుదలైన 'వీరసింహారెడ్డి'
  • బాలయ్యకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా 
  • ఈ రోజుతో 100 రోజుల పూర్తి 
  • స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన టీమ్
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'వీరసింహారెడ్డి' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించింది. 

జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ రోజుతో 100 రోజులను పూర్తి చేసుకుంది. హిందూపురం .. చిలకలూరి పేట .. ఆలూరు .. ఆదోని సెంటర్స్ లో రోజుకి నాలుగు ఆటల చొప్పున ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకుంది. అందుకు సంబధించిన వివరాలతో తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన 18వ సినిమా ఇది. ఇక ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయగానే ఒక నిమిషంలో లక్షా యాభై వేల యూనిక్ వ్యూస్ ను రాబట్టి కొత్త రికార్డును సృష్టించింది. బాలయ్య కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల జాబితాలో ఈ సినిమా చేరింది.


More Telugu News