ప్రీతిది ఆత్మహత్యనే, చావుకు సైఫ్ ప్రధాన కారణం: వరంగల్ సీపీ
- కేఎంసీ మెడికో విద్యార్థిని ఆత్మహత్య ఘటన
- వారం, పది రోజుల్లో ఛార్జీషీటు దాఖలు చేస్తామన్న సీపీ
- పాయిజన్ ఇంజెక్షన్ తో ప్రీతి ఆత్మహత్య చేసుకుందని వెల్లడి
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి నాయక్ ది ఆత్మహత్యనే అని, అయితే ఆమె ఆత్మహత్యకు సైఫ్ ప్రధాన కారకుడని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ప్రీతి పోస్టుమార్టం నివేదిక వచ్చిందని, ఇందులో కీలక విషయాలు వెల్లడైనట్లు తెలిపారు. ప్రీతిది ఆత్మహత్యనే అని రిపోర్ట్ ద్వారా వెల్లడైందన్నారు. కానీ ఈ ఆత్మహత్యకు మాత్రం సైఫ్ ప్రధాన కారణమని కూడా పేర్కొన్నారు. వారం పది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీషీటును దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి ఆత్మహత్య చేసుకుందన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న చోట ఇంజెక్షన్ దొరికిందని, కానీ నీడిల్ మాత్రం దొరకలేదని చెప్పారు. కొన్ని నెలల క్రితం కేఎంసీలో ప్రీతి ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెను నెలల పాటు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.