నేను చూసుకుంటానని చెప్పి.. కీలకమైన క్యాచ్ మిస్ చేసిన కోహ్లీ

  • పంజాబ్ మ్యాచ్ లో హర్షల్ వేసిన 17వ ఓవర్లో ఘటన 
  • క్యాచ్ విషయంలో గందరగోళం
  • క్యాచ్ పట్టేందుకు వస్తున్న ప్రభుదేశాయ్ ని నిలువరించిన కోహ్లీ
పంజాబ్ కింగ్స్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సేన 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ హాఫ్ లోకి వచ్చి, ఐదో స్థానంలో నిలిచింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కు ఆర్సీబీకి కోహ్లీ స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్నాడు. అతను 47 బంతుల్లో 59 పరుగులు చేసి, ఐపీఎల్ లో 48వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆర్సీబీ గెలిచినప్పటికీ... కోహ్లీ ఓ క్యాచ్ ను పట్టుకోవడంలో విఫలం కావడం గందరగోళానికి గురి చేసింది.

హర్షల్ బౌలింగ్ లో జితేశ్ శర్మ క్యాచ్ ను కోహ్లీ అందుకోలేకపోయాడు. 18 ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన సిరాజ్... హర్ ప్రీత్ బ్రార్, ఎలిస్, ఆ తర్వాత స్లో డెలివరీతో జితేష్ ను ఔట్ చేశాడు. దీంతో పంజాబ్ ఓడిపోయింది. 

17వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ రసవత్తర ఫుల్ టాస్ వేశాడు. జితేశ్ శర్మ బంతిని బలంగా కొట్టాడు. లాంగ్-ఆన్‌లో మోహరించిన కోహ్లీ క్యాచ్ కోసం పరుగెత్తాడు. అయితే డీప్ మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న సుయాష్ ప్రభుదేశాయ్ కూడా క్యాచ్ పట్టేందుకు పరుగు పెట్టాడు. సుయాష్ క్యాచ్ పట్టేందుకు పరుగెత్తడం చూసిన కోహ్లీ... నా కంట్రోల్ లో ఉందని, నేను చూసుకుంటానని సైగ చేశాడు. సాధారణంగా కోహ్లీ క్యాచ్ ను అంత సులభంగా వదిలేయడు. కానీ ఇక్కడ సుయాష్ కు చెప్పి మరీ ఆ బాల్ ను పట్టలేకపోయాడు. బాల్ ను పట్టుకోవడానికి కోహ్లీ తన రెండు చేతులను గాలిలో ఉంచాడు. కానీ క్యాచ్ పట్టడంలో విఫలమయ్యాడు.


More Telugu News