వివేకా కేసులో సుప్రీం వ్యాఖ్యలతో భరోసా వచ్చింది: రఘురామ

  • అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు
  • హైకోర్టు ఉత్తర్వులపై నేడు స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
  • న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం పెంచే సందర్భమన్న రఘురామ
వివేకా హత్య కేసులో ఈ నెల 25 వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. 

వివేకా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో భరోసా లభించిందని అన్నారు. ఇది న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం పెంచే సందర్భం అని పేర్కొన్నారు. సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని అవినాశ్ న్యాయవాది ప్రాధేయపడ్డారని, సోమవారం నాడు మా వాళ్లు 10 మంది న్యాయవాదులతో వాదనలు వినిపించనున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. 

కాగా, వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇవాళ కూడా విచారించింది. అయితే రేపు రంజాన్ కావడంతో అవినాశ్ ను విచారించడంపై సందిగ్ధత నెలకొంది.


More Telugu News