మహేశ్ కూతురు సితారకి అలియా భట్ సర్ ప్రైజ్ గిఫ్ట్

  • సితారకు సమ్మర్ స్పెషల్ డ్రస్ లను పంపిన అలియా
  • ఈ విషయాన్ని ఇన్ స్టాలో షేర్ చేసిన సితార
  • ఆ డ్రస్ లు తనకు ఎంతో నచ్చాయంటూ పోస్ట్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు - నమ్రతల కూతురు సితారను బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ సర్ ప్రైజ్ చేసింది. ఆమెకు సమ్మర్ స్పెషల్ డ్రస్ లను గిఫ్టులుగా పంపింది. దుస్తులతోపాటు ఓ లేఖను కూడా అందజేసింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ఖాతాలో సితార వెల్లడించింది.

‘‘నన్ను మీ కుటుంబంలో భాగం చేసినందుకు ధన్యవాదాలు’’ అని సితార పోస్ట్ చేసింది. తనకు చాలా ఆనందంగా ఉందని, తనకు పంపిన డ్రస్ లు ఎంతో నచ్చాయని అలియాకు థ్యాంక్స్ చెప్పింది. రెండు ఫొటోలను కూడా ఇన్ స్టాలో షేర్ చేసింది. 

అలియా రెండేళ్ల కిందట దుస్తులకు సంబంధించిన బిజినెస్ ను ప్రారంభించింది. ఇటీవల ఆమె తన బ్రాండ్‌ కి సంబంధించిన దుస్తులను ఎన్టీఆర్ కుమారులకు పంపి సర్ ప్రైజ్ చేసింది. అలియాకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎన్టీఆర్.. తనకు కూడా త్వరలో ఇలాంటి బహుమానం వస్తుందని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ కామెంట్‌ కు అలియా భట్ స్పందిస్తూ.. ‘మీకోసం ఈద్‌ స్పెషల్ అవుట్ ఫిట్ ని సిద్ధం చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చింది.


More Telugu News