భారత్‌లో కొత్తగా 11 వేల పైచిలుకు కరోనా కేసులు

  • గత 24 గంటల్లో కొత్తగా 11,692 కరోనా కేసుల నమోదు
  • ఒక్క రోజులో కరోనా బారినపడి 19 మంది మృతి
  • దేశంలో మొత్తం మీద యాక్టివ్ కేసుల సంఖ్య 66,170 
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 11,692 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 19 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 66,170గా ఉంది. నిన్నటి లెక్కలతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య కొంత మేర తగ్గింది. బుధవారం ఏకంగా 12,591 కేసులు వెలుగులోకి వచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. 

కేంద్రం తాజా ప్రకటన ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో మొత్తం 2,29,739 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 5.09 శాతంగా నమోదైంది. ఏడురోజుల సగటు పాజిటివిటీ రేటు 5.33 శాతంగా ఉంది. జాతీయ సగటు రికవరీ రేటు 98.67 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 0.15 శాతమని వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో 3,647 కరోనా టీకా డోసులు పంపిణీ చేయగా ఇప్పటివరకూ మొత్తం 220.6 కోట్ల డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్రం తెలిపింది.


More Telugu News