గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ పార్లమెంటులో ప్రైవేటు బిల్లు

  • ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన సీపీఐ సభ్యుడు బినయ్ విశ్వమ్
  • గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం రాజ్యాంగ సవరణ చేయాలని సూచన
  • గవర్నర్ వ్యవస్థతో రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమతౌల్యం దెబ్బతింటోందని వెల్లడి
  • ప్రజాస్వామిక ప్రభుత్వాల వ్యవహారాల్లో ప్రజలు ఎన్నుకోని గవర్నర్లు జోక్యం చేసుకోజాలరని వ్యాఖ్య
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సీపీఐ ఎంపీ బినయ్ విశ్వమ్ పార్లమెంటులో తాజాగా ఓ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ దిశగా రాజ్యంగానికి సవరణ చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రాల అధికారాలు, కేంద్రం హక్కుల మధ్య ఉండాల్సిన సమతౌల్యాన్ని గవర్నర్ వ్యవస్థ దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను ప్రజలు ఎన్నుకోలేదని, కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల విధి నిర్వహణలో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్లకు ఉండకూడదని తన బిల్లులో ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇటీవలి కాలంలో కేంద్రం నియమించిన గవర్నర్లకు, ప్రతిపక్ష పార్టీ పాలిత ప్రభుత్వాలకు మధ్య వివాదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో గవర్నర్ల తీరుపై ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగ పరుస్తోందంటూ గతంలోనూ అనేక మార్లు ఆరోపణలు వచ్చాయి.


More Telugu News