పురుషుడు పురుషుడిని, మహిళ మహిళను ఎంచుకోవడం తప్పెలా అవుతుంది?: అభిషేక్ బెనర్జీ
- స్వలింగ వివాహాలకు మద్దతు ప్రకటించిన టీఎంసీ నేత
- జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టీకరణ
- ప్రేమకు కుల, మత, సరిహద్దులు లేవన్న అభిషేక్ బెనర్జీ
స్వలింగ వివాహాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందంటూ స్వలింగ వివాహాలకు తన మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విమర్శించారు.
స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లను బుధవారం విచారించిన సుప్రీంకోర్టు.. స్వలింగ వివాహాలు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమని చెప్పేందుకు కేంద్రం వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది.
స్వలింగ వివాహాలపై తాజాగా అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ఈ విషయంపై తాను కామెంట్ చేయబోనంటూనే.. ప్రేమకు కులం, మతం, సరిహద్దులు లేవన్నారు. తాను పురుషుడినైతే పురుషుడిని, మహిళనైతే మహిళపై ఇష్టం పెంచుకోవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రేమలో పడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. పురుషుడైనా, స్త్రీ అయినా ఎవరైనా సరే తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే పూర్తి హక్కు వారికి ఉంటుందని టీఎంసీ నేత స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి కారణం లేకుండా కావాలనే జాప్యం చేస్తోందని మండిపడ్డారు.