వాట్సప్ లో సరికొత్త ఫీచర్ వచ్చేస్తోంది!

  • సొంతంగా ఎమోజీలు రూపొందించే ఆప్షన్
  • టెలిగ్రామ్ మాదిరిగా యానిమేటెడ్ ఎమోజీలు 
  • లొట్టి లైబ్రరీ సాయంతో తయారు చేస్తున్నట్టు వాట్సప్ వెల్లడి
ప్రముఖ సోషల్ మెసెంజర్ వాట్సప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణంగా యూజర్లు తమ రియాక్షన్ తెలపడానికి ఎమోజీలు ఉపయోగిస్తారు. మనం మాటల్లో చెప్పలేని భావాలను ఈ ఎమోజీల ద్వారా వ్యక్తీకరించవచ్చు. ఇప్పటిదాకా వాట్సాప్ యాప్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్‌లు ఇస్తున్న ఎమోజీలు మాత్రమే యూజర్లు వాడుతున్నారు. ఇకపై వాట్సాప్ తన యూజర్లకు సొంతంగా ఎమోజీలు అందుబాటులోకి తీసుకురాబోతోంది.

టెలిగ్రామ్ యాప్‌లో మాదిరిగా యానిమేటెడ్ ఎమోజీలను యూజర్లకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు వాట్సప్ యాజమాన్యం తెలిపింది. ఈ యానిమేటెడ్ ఎమోజీలను ‘లొట్టి లైబ్రరీ’ సాయంతో తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎమోజీలతో యూజర్లు సరికొత్త మెసేజింగ్ అనుభవం లభిస్తుందని ట్విట్టర్ అంచనా వేస్తోంది.


More Telugu News