మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. నేడే కౌంట్ డౌన్

  • షార్ నుంచి పీఎస్ ఎల్‌వీ-సీ 55 రాకెట్‌ ప్రయోగం
  • రేపు ప్రయోగించనున్న ఇస్రో
  • 424కి చేరుకోనున్న ఇస్రో పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి శనివారం పీఎస్ ఎల్‌వీ-సీ 55 రాకెట్‌ ప్రయోగం చేపట్టనుంది. ఈ ఉదయం 11.49 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల టెల్‌ ఈవోఎస్‌-2 ఉపగ్రహంతోపాటు 16 కిలోల మరో చిన్న ఉపగ్రహాన్ని పీఎస్ ల్ వీ ద్వారా రోదసీలోకి పంపనున్నారు. 

దీంతో ఇస్రో రోదసిలోకి పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 424కి చేరుకోనుంది. కౌంట్‌డౌన్‌ 25.30 గంటలు కొనసాగిన తరువాత రాకెట్‌ షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకుపోనుంది. దీని రిహార్సల్‌ను శాస్త్రవేత్తలు నిన్న విజయవంతంగా నిర్వహించారు.


More Telugu News