కోల్ కతా నైట్ రైడర్సేనా.... ఇలా అవుటయ్యారేంటి?
- ఢిల్లీలో కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు
- 20 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేసిన కేకేఆర్
- ఆఖర్లో రసెల్ మెరుపులు
- సమష్టిగా రాణించిన ఢిల్లీ బౌలర్లు
సిక్సర్ల వీరుడు రింకూ సింగ్, హార్డ్ హిట్టర్ వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ నితీశ్ రాణా, జాసన్ రాయ్ తదితరులు ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్ 127 పరుగులకే ఆలౌట్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. చివరి ఓవర్లో ఆండ్రీ రస్సెల్ (38 నాటౌట్) హాట్రిక్ సిక్సులు కొట్టడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
వరుసగా ఐదు ఓటములతో రగిలిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ఇవాళ నిప్పులు చెరిగే బంతులతో కోల్ కతా నైట్ రైడర్స్ పనిబట్టారు. జాసన్ రాయ్ ఒక్కడు కాస్త ఫర్వాలేదనిపించాడు. రాయ్ 39 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఓపెనర్ లిట్టన్ దాస్ (4), వెంకటేశ్ అయ్యర్ (0), నితీశ్ రాణా (4), మన్ దీప్ సింగ్ (12), రింకూ సింగ్ (6), సునీల్ నరైన్ (4) ఇలా వచ్చి అలా అవుటయ్యారు.
ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అనుకూల్ రాయ్ ఆడిన తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2, ఆన్రిచ్ నోర్కియా 2, అక్షర్ పటేల్ 2, కుల్దీప్ యాదవ్ 2, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు.