జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి... ఐదుగురు జవాన్ల సజీవ దహనం
- పూంచ్ జిల్లాలో ఘటన
- బింభేర్ గలి నుంచి సాంగియోట్ వైపు వెళుతున్న సైనిక వాహనం
- ట్రక్కులో ఒక్కసారిగా మంటలు... కాలిపోయిన సైనికులు
- పిడుగుపడి ఉంటుందని ప్రాథమికంగా అంచనా
- మరింత విచారణ చేయగా... వెల్లడైన ఉగ్రదాడి
- గ్రనేడ్లతో దాడి చేసినట్టు నిర్ధారించిన సైనికాధికారులు
జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులే పేట్రేగిపోయారు. పూంచ్ జిల్లాలోని ఓ సైనిక ట్రక్కును లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ట్రక్కు మంటల్లో చిక్కుకోగా, ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని ఆలస్యంగా వెల్లడైంది. ఆర్మీ వాహనం బింభేర్ గలి నుంచి సాంగియోట్ వెళుతుండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వాహనంపై పిడుగుపడి ఉంటుందని తొలుత భావించారు. అయితే, ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేయడం వల్లే ట్రక్కు మంటల్లో చిక్కుకుందని, జవాన్లు మృతి చెందారని సైనిక అధికారులు నిర్ధారించారు. ఓ జవాను తీవ్రగాయాలపాలవగా, అతడికి రాజౌరీలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దాడి ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.