పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్.. అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలం
- ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం
- స్పేస్ ఎక్స్ స్పేస్ పోర్ట్ అయిన స్టార్ బేస్ నుండి ప్రయోగం
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది. నింగిలోకి ఎగిసిన కాసేపటికే రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. గతంలో నిర్వహించిన ప్రయోగాలు కూడా విఫలమయ్యాయి. చంద్రుడు, అంగారక గ్రహం, ఇతర చోట్లకు వ్యోమగాములను పంపించడానికి రూపొందించిన ఈ అంతరిక్ష నౌక మొదటి పరీక్షలోనే ఫెయిల్ అయింది. టెక్సాస్ లోని బోకా చికాలోని ప్రయివేటు స్పేస్ ఎక్స్ స్పేస్ పోర్ట్ అయిన స్టార్ బేస్ నుండి సెంట్రల్ టైమ్ ఉదయం గం.8.33 నిమిషాలకు భారీ రాకెట్ పేలిపోయింది.