విశాఖలో కాపురం... జగన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే: యనమల
- సెప్టెంబరు నాటికి విశాఖ నుంచి పాలన అంటూ సీఎం జగన్ వెల్లడి
- ఎన్నికల ముందు పోర్టులు, సదస్సులంటూ హడావుడి చేస్తున్నారన్న యనమల
- రాజధాని మాటున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపణ
- జగన్ అసమర్థ పాలనతో ఖజానా ఖాళీ అయిందని వెల్లడి
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సీఎం జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వం పైనా ధ్వజమెత్తారు. సెప్టెంబరు నాటికి విశాఖకు వెళ్లిపోతానంటూ సీఎం జగన్ ప్రకటించడంపై మండిపడ్డారు. విశాఖలో కాపురం పెడతాననడం జగన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని విమర్శించారు.
ఎన్నికలకు ఏడాది ముందు పోర్టులు, సదస్సుల పేరుతో హడావుడా? అని యనమల ప్రశ్నించారు. విశాఖ రాజధాని మాటున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుని తాడేపల్లి నేలమాళిగలు నింపుకున్నది చాల్లేదా? అని నిలదీశారు. పథకాల మాటున భారీ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి పెట్టుబడుల వరద అంటూ మంత్రులు ఆర్భాటపు ప్రకటనలు చేశారని, కానీ నిధులు లేక పథకాలు ఆపేశామని సీఎస్ అంటున్నారని యనమల వెల్లడించారు. జగన్ అసమర్థ పాలన వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు. అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచున నిలబెట్టింది జగన్ కాదా? అని నిలదీశారు.