ఆ రోజు నన్ను కాపాడిన వ్యక్తికి ఇదే మాట చెప్పాను: సాయితేజ్
- మందు .. డ్రగ్స్ అలవాటు లేవన్న సాయితేజ్
- బైక్ పై తాను పబ్ కి వెళ్లడం లేదని వెల్లడి
- తనని కాపాడిన వ్యక్తి తనకి టచ్ లోనే ఉన్నాడని వ్యాఖ్య
- ఎవరికి తోచింది వారు రాశారంటూ ఉద్వేగం
సాయితేజ్ కొంతకాలం క్రితం బైక్ పై నుంచి పడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా 'విరూపాక్ష' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన, గతంలో జరిగిన ప్రమాదాన్ని గురించి ప్రస్తావించాడు. "ఆ రోజున జరిగిన ప్రమాదం గురించి ఎవరికి తోచింది వాళ్లు రాశారు. నేను కోలుకున్న తరువాత అవన్నీ చూసి నవ్వుకున్నాను" అన్నాడు.
"అసలు నాకు మందు అలవాటు లేదు .. నేను తాగలేదు. డ్రగ్స్ లాంటి వాటి జోలికి నేను వెళ్లలేదు. నాకు స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టం .. అందువల్లనే నేను కార్లో కాకుండా బైక్ పై వెళ్లాను. నిజానికి స్పీడ్ గా కూడా వెళ్లలేదు. నేను పబ్ కి వెళుతున్నట్టుగా కొంతమంది రాశారు .. కానీ నేను దేవ కట్టా గారి దగ్గరికి వెళుతున్నాను" అని చెప్పాడు.
" ఇక నేను బైక్ పై నుంచి పడిపోగానే నన్ను గుర్తుపట్టి హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తి ఇప్పటికీ నాకు టచ్ లోనే ఉన్నాడు. ఒక లక్ష రూపాయలు ఇచ్చేసి అతనికి థ్యాంక్స్ చెప్పచ్చు. అంతటి సాయాన్ని అలా లెక్కగట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నాకు కాల్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాను" అని చెప్పుకొచ్చాడు.