రజినీకాంత్ సర్‌ను కాపీ కొట్టేందుకు ట్రై చేశా.. ధోనీ వ్యాఖ్య
- రజనీ కాంత్ స్టైల్‌లో ధోనీ కుర్చీలో కూర్చున్న ఫొటో వైరల్
- ఈ ఫోటోపై ధోనీని ప్రశ్నించిన అభిమాని
- ఆయనలా ఆలోచించడం, చేయడం చాలా చాలా కష్టమన్న ధోనీ
చెన్నైలో ఎమ్మెస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు అక్కడి అభిమానులు ఎగబడుతుంటారు. ధోనీ సెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తారు. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే టీం.. ఐపీఎల్‌లో ఓ బలమైన శక్తిగా ఎదగడం ఇందుకు ప్రధాన కారణం. ఇక తమిళనాట సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేం. ఇక, కాబాలీ సినిమాలో రజినీకాంత్ పోజులో ధోని కూర్చున్న ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇటీవల సీఎస్‌కే నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ఫొటో ప్రస్తావన వచ్చింది.
కాబాలి సినిమాలో రజినీ కాంత్‌లా పోజు పెట్టి కూర్చున్నట్టు ఉన్నారుగా అంటూ ఓ వ్యక్తి ధోనిని ప్రశ్నించారు. ‘‘ఆ ఫొటోలో మీరు కూర్చుని పోజు ఇచ్చిన తీరు అద్భుతం. మీకీ ఐడియా ఎలా వచ్చింది’’ అంటూ ఓ వ్యక్తి కాబాలి ప్రస్తావన తెచ్చారు. దీనికి ధోనీ రిప్లై ఇస్తూ..‘‘ఓ అద్భుతమైన వ్యక్తి (రజనీకాంత్) పోజును కాపీ కొట్టేందుకు ప్రయత్నించానంతే. ఆయనలా ఆలోచించడం, చేయడం చాలా చాలా కష్టం. అందుకే కనీసం కాపీ కొట్టేందుకు ప్రయత్నించా’’ అని ధోనీ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, నుంచి ధోనీ రిటైర్మెంట్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మోయీన్ అలీ స్పందించారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కూడా ధోనీ పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాఖ్యానించాడు. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.