తనకు ప్రాణహాని ఉందన్న దస్తగిరికి భారీగా భద్రత పెంపు
- వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి
- తమకు రక్షణ కల్పించాలని కడప జిల్లా ఎస్పీని కోరిన వైనం
- 4+1 సెక్యూరిటీ కల్పిస్తూ ఎస్పీ ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి భద్రతను భారీగా పెంచారు. తనకు, తన కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్, కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందంటూ ఈరోజు కడప జిల్లా ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
ఆయన వినతిపై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించారు. దస్తగిరికి 4 ప్లస్ 1 భద్రతను కల్పిస్తూ ఆదేశాలను జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పోలీసులు సెక్యూరిటీ విధుల్లోకి చేరారు. దస్తగిరి ఇంటి వద్ద 24 గంటలూ తుపాకులతో పహారా కాయనున్నారు. ఇప్పటికే దస్తగిరికి ఒక గన్ మెన్ ఉన్నాడు. తాజాగా 4 ప్లస్ 1 సెక్యూరిటీ కల్పించడంతో.. ఆయన సెక్యూరిటీ 6కి పెరిగింది.