వైకాపా ఆరిపోయే దీపం..ఎక్స్‌పైరీ డేట్ దగ్గరకొచ్చేసింది: చంద్రబాబు
- ప్రకాశం జిల్లా గిద్దలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ
- వైసీపీ పాలన అంతా నేరాలు, అవినీతిమయం అంటూ బాబు ఆగ్రహం
- తాము వెలిగొండకు మొదటి ప్రాధ్యానత ఇస్తామని హామీ
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు బహిరంగసభలో ప్రసంగించిన ఆయన.. వైసీపీ పాలన అంతా నేరాలు, అవినీతిమయమని వ్యాఖ్యానించారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వైసీపీ అధికారంలోకి వచ్చాక మీరేమైనా సుఖపడ్డారా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఆర్టీసీ బస్సు చార్జీలు ఇంటి పన్ను పెంచారు. చెత్తపన్ను వేశారు. మద్యం రేట్లు పెంచడంతో పాటూ దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లు, జే బ్రాండ్లు అమ్ముతున్నారు. మీ రక్తాన్ని తాగే సైకో జగన్. మీరు చెల్లించే డబ్బు తాడేపల్లి ప్యాలెస్‌కు వెళుతోంది. అందులో కొంచెమే ప్రభుత్వానికి వెళుతుంది. పట్టభద్రులు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించారు.
వైకాపా ఆరిపోయే దీపం..ఎక్స్‌పైరీ డేట్ దగ్గరకొచ్చేసింది. పోలీసులు సహకరించకపోతే జగన్ రెడ్డి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకప్పుడు జీతాలు పెంచాలని అడిగే ఉద్యోగులు ఇప్పుడు ఒకటో తేదీన జీతం ఇస్తే చాలు అనే పరిస్థితికి వచ్చారు. వివేకాది గుండెపోటని ప్రజలకు చెప్పింది ఎవరు? గొడ్డలితో కిరాతకంగా చంపారని శవపరీక్షలో తేలింది. అబద్ధాలు చెప్పి, నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసుంటే గిద్దలూరు ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. మేం అధికారంలోకి వచ్చాక వెలిగొండకు మొదటి ప్రాధ్యానత ఇస్తాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.