జనాభాలో చైనాను అధిగమించిన భారత్.. అధికారికంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి
- ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లు
- ఇండియా జనాభా 142.86 కోట్లు
- చైనాలో తగ్గిపోతున్న జననాల రేటు
నిన్నటి వరకు ప్రపంచంలో ఎక్కవ జనాభా ఎక్కడ ఉందంటే అందరూ చైనా అని టక్కుమని చెప్పేవాళ్లు. ఇక నుంచి ఈ సమాధానం గతం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లు కాగా... భారత్ జనాభా 142.86 కోట్లు. 1950 నుంచి జనాభా లెక్కలను ఐక్యరాజ్యసమితి సేకరిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనానే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. ఇప్పుడు చైనాను భారత్ వెనక్కి నెట్టేసింది.
చైనాలో చాలా కాలంగా జననాల రేటు భారీగా పడిపోయింది. జనాభా తగ్గిపోతూ, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయింది. పిల్లలను కనాలంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. అక్కడి ప్రజల్లో చాలా మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం భారత్ జనాభాలో నాలుగో వంతు 14 ఏళ్ల లోపు పిల్లలే. ఇక 68 శాతం జనాభా 15-64 ఏళ్ల వయసు మధ్యస్కులే కాగా, 65 ఏళ్లకు పైబడిన వారు 7 శాతం మంది ఉన్నారు.