చర్లపల్లి జైలు నుండి తీన్మార్ మల్లన్న విడుదల, కొత్త పార్టీ ప్రకటన
- తెలంగాణ నిర్మాణ పార్టీ పేరు రిజిస్టర్
- మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ
- వీకర్ సెక్షన్ ను నమ్ముకొని ఉన్నానని వ్యాఖ్య
క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ రోజు (ఏప్రిల్ 18, మంగళవారం) ఆయన చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు. అభిమానులు ఘన స్వాగతం పలికి, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడారు. తాను త్వరలో పార్టీని పెడుతున్నానని, తన పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ పార్టీ అని వెల్లడించారు. ఈ పేరును ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ పైన, ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ సెక్షన్లను నమ్ముకొని తనలాంటి వారిని అరెస్ట్ చేయించాడని, కాని తాను వీకర్ సెక్షన్ ను నమ్ముకొని ముందుకు సాగుతున్నానని చెప్పారు. అర్హత లేని వారు కూడా మంత్రులుగా కొనసాగుతున్న కేబినెట్ ఇదే అని విమర్శలు గుప్పించారు.
గత నెలలో అరెస్టైన తీన్మార్ మల్లన్నకు మల్కాజిగిరి కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు సుదర్శన్ గౌడ్, బండారు రవీందర్, ఉప్పల్ నిఖిల్, సిర్రా సుధాకర్, చింత సందీప్ కుమార్ లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.20వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.